గుంటూరులో దారుణం: తెల్లవారే సరికి విగతజీవిగా మారిన సోదరి, సోదరుడిపైనే అనుమానం..?

ఏమైందో తెలియదు, ఎలా జరిగిందో అంతకన్నా తెలియదు. కానీ ఓ యువతి మాత్రం విగతజీవిగా మారిపోయింది. గుంటూరు జిల్లాలో లక్కన అనూష అనే యువతి రాత్రికి రాత్రే హత్యకు గురైంది. ఆమె సోదరుడే హత్య చేశాడనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారని.. హత్య చేసి పారిపోయారని చెప్పడం సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది.


నరసరావుపేటలోని లింగంగుంట్ల కాలనీలో లక్కన చిన్న బసవయ్య ఫ్యామిలీ ఉంటోంది. ఇతనికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అయితే శుక్రవారం రాత్రి అత్తమ్మ వారి గ్రామం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్లారు. బంధువుల ఇంట్లో పెద్దకర్మ కోసం వెళ్లారు. వారి కుమార్తె అనూష, కుమారుడు కుమారస్వామిని మాత్రం ఇంటికి పంపించారు. వారిద్దరూ నరసరావుపేటకు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. కానీ రాత్రికి రాత్రే అనూష విగతజీవిగా మారారు.